యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్.. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మైథలాజికల్ సూపర్ హీరో చిత్రంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆ!, జాంబిరెడ్డి లాంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న హనుమాన్ సినిమాను ను…