అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అత్యాశను ఎరగా వేసి అమాయకులను దోచుకునే కేటుగాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 50 లక్షలు కాజేసిన ఒక ముఠా ఉదంతం కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక కిలాడీ ముఠా మాయమాటలు నమ్మి, తండ్రీకొడుకులు తమ వద్ద ఉన్న భారీ మొత్తాన్ని పోగొట్టుకున్నారు. అసలేం జరిగింది? హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులకు పరిచయమైన మహారాష్ట్ర ముఠా,…