ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం.. ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. తాజాగా బీహార్‌లోని ముంగేర్ జిల్లాలోని తారాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన నాలుగు నెలలకే కొత్తగా పెళ్లైన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని మహ్‌పూర్ నివాసి జితేంద్ర తంతి కుమార్తె మౌసమ్‌గా గుర్తించారు. భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు బలవంతం చేశారని మృతురాలి కుటుంబం ఆరోపించింది.…