Pune: పూణేలోని హండేవాడి ప్రాంతంలో ఆడ కుక్కపై అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌కి చెందిన అలీముద్దీన్ అమినల్ షేక్‌గా గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన మార్చి 26న జరిగింది. ఈ విషయానికి సంబంధించి కుక్క యజమాని చంద్రశేఖర్ యాదవ్ కలేపడల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా షేక్‌ని అరెస్ట్ చేశారు.