Ismail Haniyeh: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని గుర్తుతెలియని వ్యక్తులు ఇరాన్ టెహ్రాన్ నగరంలో కాల్చి చంపారు. ఈ హత్యపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. తన ప్రాధేశిక సమగ్రతను, గౌరవాన్ని కాపాడుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు.