Hair loss: ఈ మధ్య కాలంలో జట్టు రాలడం, బట్టతల రావడం సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా యువతను ఈ సమస్య వేధిస్తోంది. అయితే ప్రస్తుత జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఇతర ఆరోగ్య సమస్యలు జట్టు రాలడాన్ని పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే ఊబకాయం కూడా జట్టు రాలడాన్ని ప్రేరిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) హార్మోన్ అధిక స్థాయికి దారి తీస్తుందని, ఇది హెయిల్ ఫొలికల్స్ ను తగ్గిస్తుందని, జట్టు రాలిపోయేలా చేస్తుందని చెబుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి జుట్టు రాలడం వల్ల త్వరగా బట్టతల కూడా వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, నిద్రలేమి జుట్టుకు పోషకాలు అందకపోవడం. జుట్టు రాలడం అనేది పురుషులకే కాదు, స్త్రీలకు కూడా సమస్య. కానీ ఈ సమస్య మగవారిలో ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది పురుషులు దీని వల్ల డిప్రెషన్ కు లోనవుతున్నారు. అందాన్ని పెంచడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ…