Home
Gyanesh Kumar
Gyanesh Kumar News
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
Abhijit Dipke: ఢిల్లీ పోలీసులు తనను ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన తిరంగా మార్చ్‌కు ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. తమను నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయని, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సిబ్బంది తన ఇంటిపై నిఘా పెట్టారని ఆయన ఆరోపించారు. ఓ వైపు సీజేపీ శుక్రవారం తిరంగా మార్చ్ నిర్వహిస్తున్నట్లు… -
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
బాలీవుడ్ నటుడు, అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు షాకిచ్చారు. అక్టోబర్ 28 లోగా భారతదేశాన్ని విడిచి వెళ్లాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న ముంబైలో నిరసన కార్యక్రమం జరిగింది. -
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
Rahul Gandhi: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇండీ కూటమి నేతలతో కలిసి సుప్రీంకోర్టుకు సోమవారం మార్చ్ నిర్వహించారు. సీఈసీని తొలగించడంతో పాటు ఈసీ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ హై ఓల్టేజ్ ధర్నా తర్వాతి రోజు మంగళవారం రాహుల్ గాంధీ తన నివాసంలో ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజంలోని ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీరందరితో ‘‘టీ… -
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
CJP Protest: ఢిల్లీలో CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ‘‘ఫేక్ కంటెంట్’’ ఇంటర్నెట్ను ముంచెత్తింది. ఇలా నకిలీ వార్తల్ని, కథనాలను ప్రచారం చేసిన సోషల్ మీడియా ఖాతాలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేశాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారం… -
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
Gyanesh Kumar Family: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ చుట్టూ వివాదం నడుస్తోంది. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ఇటు ప్రతిపక్షం కాంగ్రెస్, సీజేపీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్ కుటుంబ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. జ్ఞానేశ్ ఫ్యామిలీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యధిక చదువులు చదివిన కుటుంబాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది.… -
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటైన గొంతుకలకు ఇదే వేదిక! ప్రభుత్వాలు సమాధానం చెప్పాలంటూ సామాన్యులు రోడ్లపైకి వచ్చినప్పుడు.. న్యాయం కోసం బాధితులు రోజుల తరబడి పోరాడినప్పుడు.. దేశ రాజకీయాల్లో కొత్త శక్తులు పుట్టుకొచ్చినప్పుడు.. ఆ పోరాటాల చరిత్రలో ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది! కానీ ఇప్పుడు.. దశాబ్దాలుగా ప్రజా నిరసనలకు చిరునామాగా నిలిచిన ఈ ప్రాంతం నుంచే నిరసనకారులను అధికారికంగా దూరం చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఇకపై అధికారిక నిరసన వేదికగా ఉండదు.… -
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
Rahul Gandhi Challenges SIR in Supreme Court: ఎన్నికల ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓటర్ల పేర్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారని, ఎన్నికల జాబితాల సవరణలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై… -
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
Kerala Assembly Seeks Removal of CEC Gyanesh Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ కేరళ శాసనసభ సోమవారం తీర్మానాన్ని ఆమోదించింది. దేశంలో ఓటు హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 140 మంది సభ్యులున్న కేరళ శాసనసభలో 16వ అసెంబ్లీ రెండో సమావేశాల తొలిరోజున ఈ తీర్మానం ఆమోదం పొందింది. భారత… -
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
Police VS CJP: ఢిల్లీ పోలీసులు, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కన్వీనర్ అభిజిత్ దీప్కే మధ్య వివాదం ఏర్పడింది. తనను కస్టడీలో ఫోన్ వాడుకోవడానికి పోలీసులు అనుమతించలేదని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ఢిల్లీ పోలీసులు అభిజిత్ దీప్కేకు తన నానమ్మ మరణం, ఫోన్ వాడుకోవడానికి పోలీసులు అనుమతి ఇస్తుండటం వీడియోలో కనిపించింది. అభిజిత్ దీప్కే తన ఆరోపణల్లో.. ఢిల్లీ పోలీసులు తన న్యాయవాదితో మాట్లాడటానికి అనుమతించలేదుని, తెల్లవారుజామున 3.30 గంటలకు తన తండ్రికి ఫోన్… -
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
Mahant Rajudas: అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్‌గఢి ఆలయ మహంత్ రాజూదాస్ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనలపై తీవ్రంగా స్పందించారు. నిరసనల్లో పాల్గొంటున్న జెన్-జీపై ప్రధాని నరేంద్రమోడీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ నిరసన తెలుపుతోంది. దీనిపై రాజూదాస్ మాట్లాడుతూ.. జెన్-జీ యువత దేశాన్ని ఏకం చేయాలి, కానీ విభభించేది కాదని అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలని భావించే యువతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్…
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!