ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ఘాటైన వ్యాఖ్యలు కొనసాగుతూనే వున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మిగిలిపోయిన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా అంశం తొలగింపు వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. దీని వెనుక ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రమేయం కూడా ఉందంటూ బీజేపీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో…
కేంద్ర బడ్జెట్ ను ప్రశంసిస్తూ.. రాజ్యసభలో వైసీపీ పాలనపై విమర్శలు చేశారు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 2014-15లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన నిధుల కంటే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అన్నారు జీవీఎల్. 2020-21లో, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.77,538 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు రూ.55,000 కోట్లు ఆదాయం పొందిందని ఎంపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌పై…