రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గుట్టల వేణుగోపాల్ (26)గా గుర్తించారు. వేణుగోపాల్ తన అన్న, వదినతో కలిసి మణికొండలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం, తాను నివసిస్తున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు…