ఇవాళ టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అని ప్రశ్నిస్తే, మెజారిటీ జనం తమన్ పేరే చెబుతారు. పిన్న వయసులోనే తండ్రి దగ్గర సంగీత సాధన మొదలు పెట్టడమే కాదు… చిన్నప్పుడే చిత్రసీమలోకి వాద్య కళాకారుడిగా అడుగు పెట్టడం కూడా తమన్ కు కలిసి వచ్చింది. నిన్నటి తరం సంగీత దర్శకులు ఎంతోమంది దగ్గర తమన్ వర్క్ చేశాడు. విశేషం ఏమంటే… ఇప్పటికీ తన చిన్నప్పటి రోజులను, సంగీత గురువులను తమన్ తలుచుకుంటూనే…