సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల నుంచి మహేష్ ని మాస్ సినిమా వైపు తీసుకొచ్చిన త్రివిక్రమ్… 2024 జనవరి 12న ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అయ్యాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ గుంటూరు కారం సినిమాపై అంచనాలని పెంచేసింది. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా గుంటూరు కారం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు…