Gunda Appala Suryanarayana Passes Away: ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అలియాస్ గుండ సూర్యనారాయణ కన్నుమూశారు. ఇంటిలో కాలుజారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలవ్వగా, గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను…