రాఖీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ యువకుడిని దుండగులు హత మార్చారు. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి ఆర్‌ఎంపీ డాక్టర్ కొడుకును హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Jewelry Shop Robbery In Mumbai Viral video: మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం రాత్రి అచ్చం సినిమా తరహాలో దోపిడీ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించి దుకాణంలోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఏకంగా రూ. 11 లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ముంబైలోని ఖర్ఘర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులు నల్లటి దుస్తులు ధరించి, ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారని…
అమెరికాలోని టెక్సాస్‌లో దారుణమైన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సవన్నా క్రీగర్ అనే 32 ఏళ్ల మహిళ తన 3 ఏళ్ల కుమారుడిని కాల్చి చంపి, ఆ తర్వాత తుపాకీతో తనకు తాను కాల్చుకుంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయే ముందు తల్లి ఫోన్లో భయంకరమైన వీడియోను రికార్డు చేసింది. 'మీ తండ్రికి వీడ్కోలు చెప్పు' అంటూ వీడియోలో రికార్డైంది.