ఆ మాజీ మంత్రి సోదరుడికి పసుపు వాసన పడలేదా? అందుకే కాషాయం కప్పుకుని మురిసిపోతున్నారా? టీడీపీ ఎమ్మెల్యే బ్రదర్ మిత్రపక్షం బీజేపీలో చేరడాన్ని ఎలా చూడాలి? పాత నియోజకవర్గంలో పట్టు పోతోందని ఆ టీడీపీ ఎమ్మెల్యేనే బ్రదర్‌ని పంపారా? లేక అక్కడున్న పొలిటికల్ వ్యాక్యూమ్‌తో అలా అయిపోయిందా? ఎక్కడ జరిగిందా వ్యవహారం? ఎవరా బ్రదర్స్? మాజీ మంత్రి, గుంతకల్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వరుసకు సోదరుడు నారాయణ టీడీపీ కండువా తీసేసి కాషాయమ కప్పుకున్నారు. బీజేపీ…
వైసీపీ మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే... గుమ్మనూరు జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది. పార్టీలు మారినా... వాళ్ళ వివాదాస్పద తీరు మాత్రం మారదా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. నిత్య వివాదం లేకుంటే వీళ్ళకు నిద్ర పట్టదా అని కూడా మాట్లాడుకుంటున్నారట.
ఆలూరు కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో మాజీ మంత్రి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కజిన్ గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు.. గుమ్మనూరు నారాయణ ఇంట్లో సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు.