JD Chakravarthy: టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గులాబీ దగ్గర నుంచి మొన్న మొన్న వచ్చిన దహనం వరకు ఆయన మార్క్ కనిపించేలా చేస్తాడు. ప్రస్తుతం దయ అనే సినిమాతో ఓటిటీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మధ్యనే తన భార్య తనపై విష ప్రయోగం చేసిందని, దాని నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చిన జేడీ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు.
చిత్రసీమ తల్లివంటిది. సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజున ఆ తల్లి కరుణించక మానదు అంటారు. ఎందరో అలాగే నమ్ముకొని సినిమా రంగంలో తమదైన బాణీ పలికించారు. నటుడు బ్రహ్మాజీ కెరీర్ ను పరిశీలించి చూస్తే అది నిజమే అనిపించక మానదు. తన తరం వారు హీరోలుగా వెలిగినా, ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఉన్నారు. బ్రహ్మాజీ మాత్రం ఇప్పటికీ బిజీగానే సాగుతున్నారు. తనకంటే వయసులో ఎంతో చిన్నవారయిన నటులతోనూ ఫ్రెండ్ గా నటించేస్తూ సందడి చేస్తున్నారు…