గుజరాత్ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోదీని ఇరికించేందుకు కుట్ర పన్నినట్లుగా గుజరాత్ పోలీసులు పేర్కొన్నారు. 2002లో గుజరాత్ అల్లర్లకు నరేంద్ర మోదీ కారణం అని ఆయన్ను ఈ కేసులో ఇరికించేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ పనిచేశారని చెబుతూ.. ఆమె బెయిల్ పిటిషన్ ను శుక్రవారం గుజరాత్ పోలీసులు వ్యతిరేకించారు. కాంగ్రెస్ దివంగత నేత, సోనియాగాంధీ సలహాదారు గా ఉన్న అహ్మద్ పటేల్ పన్నిన కుట్రలో తీస్తా సెతల్వాడ్ భాగమయ్యారని…