అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందనగా, హఠాత్తుగా ముఖ్యమంత్రి విజయ్ రూపానిని రాజీనామా చేయమని బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం ఆదేశించడం రాజకీయ వ్యూహమే అంటున్నారు. గతంలో, 2016 లో కూడా, 16 నెలలు ముందుగా ముఖ్యమంత్రి గా ఆనందిబెన్ పటేల్ ను రాజీనామా చేయాలని ఆదేశించింది అధికార బీజేపీ అగ్రనాయకత్వం. గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న, శక్తివంతమైన పటేల్ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశమే బీజేపీ అగ్రనాయకత్వం ప్రస్తుత నిర్ణయానికి ప్రధాన కారణం…