జీఎస్టీ సంస్కరణలపై కేంద్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఇవి కచ్చితంగా సామాన్యులు, మధ్యతరగతికి ఊరట ఇస్తాయనే నమ్మకంతో ఉంది. ఆర్థిక మంత్రి అయితే ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో గణాంకాలతో సహా చెబుతున్నారు. ఇప్పటికే జీఎస్టీ అవుట్ రీచ్ ప్రోగ్రాముల్లో మంచి స్పందన వచ్చిందనే భావనతో ఉన్నారు.
GST Rate Cut Impact: జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఆటో కంపెనీల తర్వాత.. తాజాగా FMCG(ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించనున్నాయి. దేశంలోని అతిపెద్ద ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ యూనిలీవర్ (HUL), దాని ప్రసిద్ధ ఉత్పత్తులైన డబ్ షాంపూ, లైఫ్‌బాయ్ సోప్, హార్లిక్స్, కాఫీ, ఇతర వస్తువుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
భారత ప్రభుత్వం జీఎస్టీలో విస్తృతమైన మార్పులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. చాలా వస్తువులను 12% పన్ను స్లాబ్‌ను తొలగించి, 5% స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.