స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘దీపావళి బహుమతి’ ప్రకటించిన తర్వాత, ఆర్థిక మంత్రిత్వ శాఖ GST కౌన్సిల్‌కు ఒక ప్రతిపాదనను సమర్పించింది, ఇందులో నిర్మాణాత్మక సంస్కరణ, పన్ను రేట్లను తగ్గించడం. GSTని సులభతరం చేయడం వంటివి ఉన్నాయి. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, 2017లో ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చివేసిన ఒక ప్రధాన సంస్కరణగా జీఎస్టీని మోడీ అభివర్ణించారు. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ ప్రతిపాదనను మంత్రుల బృందం (జీఓఎం) సమీక్షిస్తోంది. ప్రస్తుత…