GST On Food Items: మైదా, బియ్యం వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఎస్‌టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సిఫారసు చేయలేదని పేర్కొంది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు.