దేశంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం వెల్లడించింది. గతేడాది కంటే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో భారీగానే వసూళ్లు అయినట్లు తెలిపింది. దాదాపు 6.5 శాతం వసూళ్లు పెరిగాయి. రూ.1.73 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు స్పష్టం చేసింది.