తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ ఫొటోలుతో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు సుభాష్... వాణిజ్య పన్నులశాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (FAC)గా పనిచేస్తున్న ఎస్.సుభాష్ చంద్రబోస్.. రాజధాని అమరావతిపై ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టులు పెట్టారు.