Congress: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బడిముబ్బడిగా హామీల వర్షం కురిపించింది. అయితే, ఇప్పుడు ఈ హామీల వల్ల ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్త పన్నులు విధించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక సర్కార్ ప్రతిపాదించిన ‘‘గ్రీన్ సెస్’’ ముసాయిదా రూపొందించకముందే రాజకీయంగా కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది.