గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగడంతో అధికారపార్టీ టీఆర్‌ఎస్‌లో సందడి మొదలైంది. ఎమ్మెల్యేలకు తలనొప్పులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఒక్కో డివిజన్ నుంచి వందల మంది పోటీకి సిద్ధపడుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఈ దశలో టికెట్ రానివారి రియాక్షన్ ఎలా ఉంటుందోనని తలుచుకుని ఆందోళన చెందుతున్నారట. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు! గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే అయినా.. పరిధి మాత్రం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది.…