అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంచు కారణంగా 100 కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కొన్ని వాహనాలు రహదారి నుండి జారిపోయాయి. మిచిగాన్ స్టేట్ పోలీసులు హడ్సన్‌విల్లే సమీపంలోని గ్రాండ్ రాపిడ్స్‌కు నైరుతి దిశలో ఉన్న ఇంటర్‌స్టేట్ 196 రెండు దిశలను మూసివేశారు. అధికారులు 30 కి పైగా సెమిట్రైలర్ ట్రక్కులతో సహా అన్ని వాహనాలను తొలగించడానికి చర్యలు చేపట్టారు. చాలా మంది గాయపడ్డారని, కానీ ఎటువంటి మరణాలు సంభవించలేదని రాష్ట్ర పోలీసులు తెలిపారు.…