Liquor Case: తాజాగా లిక్కర్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ1 – కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు, ఏ31 – ధనుంజయ రెడ్డి, ఏ32 – కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 – గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఈ నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు, ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని…
ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టుకు తరలించారు. మద్యం కుంభకోణం కేసులో గోవిందప్ప ఏ33గా ఉన్నారు. కుంభకోణంలోని వేల కోట్లను డొల్ల కంపెనీలకు మళ్లించి అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో గోవిందప్ప కీలక పాత్ర పోషించారు. ఇక గోవిందప్ప రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ…