హింసాకాండ చెలరేగిన ముర్షిదాబాద్‌లో ఈ రోజు ( ఏప్రిల్ 18న ) నుంచి రెండో రోజుల పాటు పర్యటించబోతున్నట్లు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ పేర్కొన్నారు. ముర్షిదాబాద్‌లో శాంతిని నెలకొల్పేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. పోలీసుల విచారణపై ఆరోపణలు రావడంతో కోల్‌కతా హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశింది. ప్రస్తుతం ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తోంది.
Governor CV Ananda Bose: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ నేతలతో భేటీ కావచ్చని తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ వర్సెస్ సీఎంగా రాజకీయం కొనసాగుతోంది. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, సీఎం మమతా బెనర్జీకి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌పై దుష్ప్రచారం చేయడంపై ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులపై కేంద్రం క్షమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు కేంద�