రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించింది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా రేపు సెలవుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. వర్షాలు మరో రెండు రోజుల పాటు పడే అవకాశం ఉండడంతో.. అన్ని పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు సీఎం కేసీఆర్.. అయితే, అత్యవసర సేవలకు సంబంధించినవారు మాత్రం విధుల్లో ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎస్ సోమేష్ కుమార్‌తో సమీక్ష జరిపారు సీఎం కేసీఆర్.. ఇక, రేపు అసెంబ్లీ సమావేశాల్లో.. సభను నిర్వహించడంపై…