భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ , వ్యవసాయ రంగం వేగంగా ఆధునీకరణ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పడానికి 2025 సంవత్సరం ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. దేశ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, ఒకే ఏడాదిలో దేశీయ ట్రాక్టర్ అమ్మకాలు పది లక్షల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించాయి. ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్ (TMA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025లో ఏకంగా 10.9 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది…