గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీచేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. EC ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు సిటీ పోలీసులు. ఈ విషయంపై రాజా…