Apple Pay: గూగుల్ పే, ఫోన్ పే ప్రస్తుతం భారతదేశంలో యూపీఐ లావాదేవీల్లో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి. ప్రజలు వీటి ద్వారానే ఎక్కువగా క్యాష్ లెస్ లావాదేవీలు నడుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రముఖ మొబైల్ ఫోన్ల దిగ్గజం ఆపిల్ కూడా తన పేమెంట్ ఫీచర్ ‘ఆపిల్ పే’ను భారత్‌లో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ఇప్పటికే సంబంధిత సంస్థలైన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)తో చర్చలు జరుపుతోంది.