Google: ఐటీ ఇండస్ట్రీలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడుతాయో తెలియడం లేదు. నిన్న మెటా మరో బాంబ్ పేల్చింది. ఇప్పటికే 13,000 మందిని తొలగించిన మెటా మరోసారి వేల సంఖ్యలో ఉద్యోగులను వచ్చే వారం తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది గూగుల్ సంస్థల్లో కొద్ది మందికి మాత్రమే ప్రమోషన్లు ఉంటాయని సీఎన్బీసీ నివేదిక వెల్లడించింది. సీనియర్లుగా ప్రమోషన్లు తగ్గుతాయని గూగుల్ ఇప్పటికే ఉద్యోగులకు తెలిపినట్లు సమాచారం.