రచయిత,నటుడు గొల్లపూడి మారుతీరావు రాసిన అనేక రచనలు తెలుగు పాఠకలోకాన్ని ఆకట్టుకున్నాయి. ఇక చిత్రసీమలోనూ ఆయన మాటలు, కథలు భలేగా మురిపించాయి. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాదికాదు ఆకలిది” వంటి సూపర్ హిట్ హిందీ రీమేక్ సినిమాలకు గొల్లపూడి మాటలు రాశారు. ఆ చిత్రాల షూటింగ్ సమయంలో యన్టీఆర్ కు అదేపనిగా డైలాగ్స్ నేరేట్ చేసేవారు గొల్లపూడి. రామారావును ఎంతగానో అభిమానించడం వల్ల ఆయన వాచకశైలిని ఉద్దేశించే…