చెన్నైలోని ఫాంహౌస్ లో ఎన్ఆర్ఐ దంపతులను హత్య చేసి భారీగా బంగారం, నగదుతో పరారవుతున్న ఇద్దరు నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శనివారం సాయంత్రం టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన పోలీసులు తమిళనాడు రిజిస్ట్రేషన్ కారు (టీఎన్ 07 ఏడబ్ల్యూ 7499) ను ఆపారు. అందులో ఉన్న ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉంటున్న శ్రీకాంత్ (58), అనురాధ(53) దంపతులకు చెన్నైలోని మైలవరం ప్రాంతంలో ఫాంహౌస్ ఉంది.…