తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న నదీజలాల వివాదాలకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలసంఘం (CWC) చైర్మన్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. గత 11 ఏళ్లుగా…