Business Headlines 02-03-23: ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్: ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి 2 రోజులు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది. శుక్రవారం, శనివారం నిర్వహిస్తున్న ఈ సదస్సుకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఓడరేవు ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించటంపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక వనరుల నుంచి పంప్డ్ స్టోరేజ్ పద్ధతిలో పవర్ జనరేట్ చేసే ఇండస్ట్రీలు రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.