Alcohol: సాధారణంగా ఆల్కాహాల్ తాగితే మత్తులో మంచి నిద్ర వస్తుందని అందరు అనుకుంటారు. అయితే అది నిజం కాదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆల్కహాల్‌ని వదులుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుందని కీలక అధ్యయనంలో వెల్లడైంది. సాయంత్రం పూట ఒకటి లేదా రెండు మద్యపానీయాలను తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తు్న్నాయి. సాధారణంగా మద్యపానం తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపోవడానికి సాయపడొచ్చని కానీ ఇది రాత్రంత నిద్రా భంగానికి కారణమవుతుందని తెలిపింది.