Viral Video: ఇటీవల కాలంలో యువత గుండెపోటుతో హఠాత్తుగా మరణిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేస్తూ కుప్పకూలిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లోని విదిషలో జరిగింది. పెళ్లి వేడుకల్లో డ్యాన్సు చేస్తూ, 23 ఏళ్ల యువతి ఉన్నట్టుండి కుప్పకూలింది. స్టేజ్ పైనే పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.