Home
Ghmc
Ghmc News
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే లక్డీకాపూల్ జంక్షన్లో ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగర ట్రాఫిక్ పోలీస్, జీహెచ్ఎంసీ విభాగం నడుం బిగించాయి. రవీంద్రభారతి – లక్డీకాపూల్ – ఇక్బాల్ మినార్ కూడళ్ల మధ్య ప్రతిపాదిత ‘వన్ వే’ విధానాన్ని నవంబర్ 22వ తేదీ (ఆదివారం) ఒక రోజు పాటు ప్రయోగాత్మకంగా (ట్రయల్ రన్) అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ నూతన ట్రాఫిక్ విధానం అమలుకు అవసరమైన క్షేత్రస్థాయి ఏర్పాట్లు, రోడ్డు ఇంజినీరింగ్ పనులను… -
Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరి రావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కొరడా ఝుళిపించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం తెల్లవారుజాము నుంచే అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు సూర్యాపేటలోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలో నివాసముంటున్న డాక్టర్ యాదగిరి రావు ఇంట్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఉదయం నుంచే… -
Hyderabad Rains: రెండు నెలల తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన ఉక్కపోతతో భయాందోళన చెందుతున్న హైదరాబాద్ ప్రజలకు వరుణుడు భారీ ఉపశమనం అందించాడు. శీతాకాలం ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం వేళల్లో తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు రెండు నెలల తర్వాత శుక్రవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడింది. తూర్పు నుంచి పడమర వరకు తడిసిముద్దయిన నగరం మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ కాగా, సాయంత్రానికి… -
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన బార్ల నోటిఫికేషన్‌కు అపూర్వ స్పందన లభించింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా , స్థానిక పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని మున్సిపాలిటీలు , కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం కొత్తగా 41 బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఊహించని విధంగా… -
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
హైదరాబాద్ నగరంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుస దాడులతో దూకుడు పెంచారు. తాజాగా మెహిదీపట్నంలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ గోల్కొండ జోన్, సర్కిల్-33 (మెహదీపట్నం) కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి తులసిరామ్ సునీత భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఘటన వివరాల్లోకి వెళితే.. ఓ బాధితుడి భవన నిర్మాణానికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ‘స్పీకింగ్ ఆర్డర్స్’ను పట్టించుకోకుండా, నిర్మాణాన్ని… -
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ చిక్కులను వదిలించేందుకు చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టు రీ-అలైన్‌మెంట్‌కు జీహెచ్ఎంసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రీ-అలైన్మెంట్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో ప్రతిపాదించిన సంక్లిష్టమైన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ల ప్రణాళికను మార్చి, దానికి బదులుగా ఒకే ఒక భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ఒక అండర్‌పాస్ నిర్మాణంతో నూతన రీ-అలైన్‌మెంట్‌కు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు.… -
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
హైదరాబాద్ నగర మహానగర పాలనలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ నూతనంగా తీసుకువచ్చిన ‘క్యూర్’ (CURE) చట్టం రేపటి నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. 1955 నాటి జీహెచ్ఎంసీ యాక్ట్ స్థానంలో రూపుదిద్దుకున్న ఈ కొత్త చట్టం ద్వారా జీహెచ్ఎంసీ (GHMC), సీఎమ్సీ (CMC), ఎమ్ఎమ్సీ (MMC) పరిధులకు ఒకే సమగ్ర పాలనా విధానం రానుంది. విలీన ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న వేర్వేరు పన్నుల విధానాలు, పాలనా వ్యత్యాసాలకు ఈ యాక్ట్‌తో శాశ్వతంగా తెరపడనుంది. మూడు కార్పొరేషన్ల… -
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
రాష్ట్రంలో దీర్ఘకాలంగా నలుగుతున్న 22A నిషేధిత భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. నివాసిత ప్లాట్లు, లేఅవుట్లకు సంబంధించి జీహెచ్ఎంసీ (GHMC), హెచ్ఎమ్డీఏ (HMDA) లేదా డీటీసీపీ (DTCP) వంటి ప్రభుత్వ అధీకృత సంస్థల నుంచి అనుమతులు కలిగి ఉంటే.. సదరు భూములు 22A జాబితాలో ఉన్నప్పటికీ వాటి రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.… -
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా సైదాబాద్ , పరిసర ప్రాంతాల ప్రజలకు జీహెచ్ఎంసీ తీపి కబురు అందించింది. గత ఆరేళ్లుగా వివిధ రకాల అడ్డంకులతో సాగుతూ వచ్చిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి జీహెచ్ఎంసీ ముహూర్తం ఖరారు చేయగా, రేపు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇది అధికారికంగా ప్రారంభం కానుంది. రూ.620 కోట్ల బడ్జెట్ , ప్రాజెక్టు వివరాలు జీహెచ్ఎంసీ సుమారు రూ. 620… -
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూసారాంబాగ్‌లో పర్యటించిన సీఎం.. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల కొత్త లోగోలను ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ నుంచి రెండు కార్పొరేషన్లను వేరు చేసిన తర్వాత కొత్త లోగోలను రూపొందించారు. దాదాపు పదేళ్ల తర్వాత జీహెచ్ఎంసీకి కొత్త లోగోను తీసుకొచ్చారు. ప్రపంచ నగరంగా హైదరాబాద్.. హైదరాబాద్ నగరం ఇప్పటికే విద్య, ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంతో పోటీ…
తాజావార్తలు
-
Godhra Case: గోద్రా రైలు దహనం కేసులో కీలక పరిణామం.. జీవిత ఖైదు దోషికి బెయిల్!
-
Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
-
IND vs NZ 1st Test: 42 మెయిడిన్ ఓవర్లు.. 43 ఓవర్ల పాటు బ్యాటింగ్.. నాలుగు టెస్టులు డ్రా.. అరుదైన రికార్డులు ఇవే!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Nandamuri Balakrishna: ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి.. కొత్త కౌన్సిలర్లకు బాలయ్య కీలక సందేశం
ట్రెండింగ్
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!