CM Revanth Reddy: హైదరాబాద్ నగర ప్రజలను వర్షాలు వదలడం లేదు. ఇటీవల కురిసిన కుంభవృష్టి నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జీహెచ్ఎంసీ పరిధిలో కుండపోత వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం సుమారు 4 గంటలుగా కురుస్తోంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో రోడ్లు మునిగిపోయాయి.