Madhya Pradesh: ఓ దర్గాను ధ్వంసం చేశారు గుర్తుతెలియని దుండగులు. అంతటితో ఆగకుండా ఆ ముస్లిం ప్రార్థనా స్థలంపై హిందూ జెండా ఎగరేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ అంశంపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.