(ఏప్రిల్ 9తో ‘ఘరానామొగుడు’కు 30 ఏళ్ళు) మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు విజయదుందుభి మోగించాయి. అసలు చిరంజీవి కెరీర్ ను పరిశీలిస్తే రాఘవేంద్రరావు సినిమాలతోనే ఆయనకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్ గా నటించినా, డాన్సులతో మంచి మార్కులు పోగేశారు. తరువాత యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘తిరుగులేని మనిషి’లోనూ ఓ కీలక పాత్రలో…