సినీ సంగీత ప్రపంచంలో ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల)వారి చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’ అనే మూవీని అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి గారు నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను…
తెలుగు చిత్రసీమలో ‘మాస్టారు’గా నిలచిన ఘంటసాల వేంకటేశ్వరరావును తలచుకున్న ప్రతీసారి తెలుగువారి మది పులకించి పోతూనే ఉంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఘనవిజయాలు చూసిన చిత్రాలలో సింహభాగం ఆయన గళమాధుర్యంతో రూపొందినవే. ఇక ఆ నాటి మేటి నటులకు ఘంటసాల గానమే ప్రాణం పోసింది. అలాగే ఆయన స్వరకల్పన సైతం జనాన్ని పరవశింప చేసింది. తెలుగు సినిమాకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అంటారు. ఆ రెండు కళ్ళలోనూ కాంతి నింపిన ఘనత ఘంటసాలదే! “ధారుణి రాజ్యసంపద…