కన్నడ స్టార్ యష్ తదుపరి మూవీ టాక్సిక్’ (Toxic)పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న యష్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన రెండు నిమిషాల స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఇది ‘హాలీవుడ్ రేంజ్’లో ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే, ఈ గ్లింప్స్‌లో శృంగార సీన్ చూపించడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు మేకింగ్‌ను మెచ్చుకుంటుంటే, మరికొందరు విమర్శలు…