ప్రపంచంలోనే అరుదైన అన్నవాహిక ఆంత్రమూలం (ఈసోఫాగోడ్యుయోడెనాల్) స్టెంట్ ద్వారా జీర్ణాశయ లోపం సరిదిద్ది ప్రాణాలు కాపాడిన మెడికవర్ వైద్యులు ప్రపంచంలోనే అరుదైన ఈసోఫాగోడ్యుయోడెనాల్ స్టెంటింగ్ (బేరియాట్రిక్ సెట్టింగ్‌కు వెలుపల) కేస్ ఇది. అత్యంత అరుదైన వైద్య స్థితితో ఇబ్బంది పడుతున్న యెమన్‌కు చెందిన ఓ 35 సంవత్సరాల వ్యక్తి ప్రాణాలను మెడికవర్ వైద్యులు కాపాడారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఓ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని కడుపులో కుడి వైపు నుంచి బుల్లెట్లు దూసుకుపోయాయి.…