వింటర్ సీజన్‌లో వెల్లుల్లి తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. అందులో అనేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడడంలో, నివారించడంలో సహాయపడతాయి. చలికాలంలో రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా.. అనేక వ్యాధులను నివారిస్తుంది. వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.