Helth Tips: చలికాలంలో వెల్లుల్లి రెబ్బలు తింటే ఆరోగ్యప్రయోజనాలెన్నో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వింటర్ సీజన్‌లో వెల్లుల్లి తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. అందులో అనేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడడంలో, నివారించడంలో సహాయపడతాయి. చలికాలంలో రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా.. అనేక వ్యాధులను నివారిస్తుంది. వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పెరిగి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. రక్తాన్ని పలుచగా చేసి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి.. శీతాకాలంలో వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
జలుబు, దగ్గును కంట్రోల్ చేస్తుంది
చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వసాధారణం. మారుతున్న వాతావరణం పిల్లలు, పెద్దలకు సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ వెల్లుల్లిని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లి సహజంగా యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాల వల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి చట్నీ, కూరగాయలలో వెల్లుల్లిని వేయడం లేదా పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం, ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Also Read
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
చలి నుండి ఉపశమనం
వెల్లుల్లిలో వేడి పుట్టించే గుణాలు ఉన్నాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి, చలిని తగ్గిస్తుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. వెల్లుల్లి చేతులు, కాళ్ళకు వెచ్చదనాన్ని తెస్తుంది. చలిని నివారించడానికి ఇది సహజమైన మార్గం.
వెల్లుల్లితో రోగనిరోధక శక్తిని పెంచుకోండి
చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ సీజన్‌లో వైరస్‌లు, బ్యాక్టీరియాలు యాక్టివ్‌గా మారడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు వస్తాయి. అటువంటి పరిస్థితిలో.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉన్న అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి చలికాలంలో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!