మనదేశంలో గవర్నర్ వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎప్పటినుంచో వుంటోంది. రాజ్యాంగ బద్ధమయిన పదవిని రాజకీయాలకు వాడుకుంటున్నారని, ప్రభుత్వాలను సరిగా పనిచేయకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఏనాటినుంచో వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతోందంటున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మళ్ళీ ఈ అంశం తెరమీదకు వచ్చిందనే చెప్పాలి. గతంలో ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో వివాదం తలెత్తింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో గవర్నర్ వ్యవహరించిన…