కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. సోమవారం నాడు విశాఖ నార్త్ నియోజకవర్గంలో టీడీపీ మహిళా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి బూత్ లెవల్ వరకు పటిష్టంగా ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వాలంటీర్ల…
అయ్యన్నపాత్రుడు. ఇద్దరు మాజీ మంత్రులు సుదీర్ఘ కాలంగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి సాగిన సందర్భాలు లేవు. 2014-19 మధ్య అయ్యన్న, గంటా ఇద్దరు చంద్రబాబు కేబినెట్ మంత్రులు. ఆ సమయంలోనూ ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు అరుదే. ఒకరిని ఇరుకున పెట్టేందుకు మరొకరు ఎత్తులు పైఎత్తులు వేసుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయ్యన్న గళం విప్పుతుంటే.. రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో నాలుగుసార్లు పార్టీ మారిన చరిత్ర గంటాది. విశాఖ…
ఆ మాజీ మంత్రి నోట కొత్త పలుకులు వినిపిస్తున్నాయ్. ఎప్పుడూ రాజకీయాలు, ఎత్తుగడలు మాట్లాడే ఆయన.. ఈసారి కులం కెపాసిటీ గురించి చర్చిస్తున్నారు. అదీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు నుంచీ. అంతర్మథనంలో ఉన్న సామాజికవర్గానికి దిక్సూచిగా మారాలనే ఆలోచన ఉందా? లేక రాజకీయాల్లో చురుకైన పాత్రకు వేసిన వ్యూహమా? గంటా చూపు జనసేన వైపు అని పుకార్లు షికారు..! గంటా శ్రీనివాసరావు. మాజీ మంత్రి. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండున్నరేళ్లుగా మౌనంగా ఉంటున్నారు. అధికారం…