తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, హెరాయిన్, బంగారం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. కృష్ణా జిల్లాలో మాదకద్రవ్యాలకు అడ్డాగా మారింది నందిగామలోని విజయ టాకీస్ సెంటర్. డ్రగ్స్ మత్తులో యువత జోగుతోంది. ఇటీవలి కాలంలో యువత డ్రగ్స్ మత్తులో చిత్తవుతున్నారు. అక్కడ యువత గంజాయికి బానిసగా మారుతున్నారని స్థానికులు చెబుతున్నారు. డ్రగ్స్ దొరక్కపోతే యువత ఆత్మహత్యలకు పాల్పడతామని వార్నింగ్ లు ఇస్తున్నారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేస్తున్నారు. తమ పిల్లలు డ్రగ్స్ కి బానిసలవుతున్నారని, బ్లేడ్‌తో కోసుకుంటున్నారు.…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయిని మించిన హాట్ టాపిక్ లేదు. పోలీసుల కళ్ళు గప్పి గంజాయి విద్యాసంస్థలకు సరఫరా అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి,కాఫ్ సిరప్,టాబ్లెట్స్ లను విద్యాసంస్థలే లక్ష్యంగా యువతకు అమ్ముతున్న ముఠా ను 29వ తేదీన 2వ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. విముక్తి కాలనీ సమీపంలో ఒక పాడుబడిన హాస్పిటల్ ప్రాంగణంలో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. మట్టి విజయ్ కుమార్…